మన జాతీయ గుర్తింపు

23. మన జాతీయ గుర్తింపు: | మన జాతీయ గుర్తింపు (identity) గురించి మనం ఆలోచించటం అత్యంత అవసరం. ఈ గుర్తింపులేనిదే స్వాతంత్ర్యానికి అర్ధంలేదు, పురోగతికి, సుఖసంతోషాలకు స్వాతంత్ర్యం సాధనం కాజాలదుకూడాను. మన జాతీయ గుర్తింపు ఏమిటో మనకు ఎరుక కలగనంత వరకు మనలోని శక్తి సామర్థ్యాలను మనం గుర్తించజాలము, అభివృద్ధి చేసుకోజాలము. విదేశీ పాలనలో ఈ గుర్తింపు అణచి వేయబడింది. అందుకనే దేశాలు తమ సహజ స్వభావాను సారం పురోగతి సాధించగలగటానికి, తమ కృషిలో ఆనందాను భూతిని పొందగలగటానికి స్వతంత్రంగా వుండగోరుతాయి. స్వభావం శక్తివంతమైనది. స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించడానికి, లేక దానిని నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నిస్తే కష్టాలకు దారితీస్తుంది. సహజ ప్రవృత్తులను నిర్లక్ష్యం చేయలేము కాని ఈ స్వభావాన్ని సంస్కృతి స్థాయికి ఎదిగేలా చేసుకోవటం సాధ్యమే. వివిధ సహజ ప్రవృత్తులను అణచివేసుకున్నందువల్ల అనేకరకాల మానసిక జాడ్యాలు ఎలావస్తాయో మనస్తత్వశాస్త్రం మనకు చెబుతున్నది. అలాంటి వ్యక్తి అశాంతంగా, భిన్నహృదయుడై వుంటాడు. అతని సామర్థ్యాలు క్రమంగా సన్నగిల్లి వికృతి చెందుతాయి. వ్యక్తిలాగానే జాతికూడా తన సహజ ప్రవృత్తులను నిర్లక్ష్యం చేసినపుడు నానారకాల జాడ్యాలకు లోనవుతుంది. భారత్ ఎదుర్కోంటున్న సమస్యలన్నింటికీ మౌలిక కారణం తన జాతీయ గుర్తింపును నిర్లక్ష్యం చేయటమే.

Post a Comment

0 Comments