21. జాతి యొక్క ఆదర్శం 'చితి': జాతిని సంరక్షించడానికీ, జాతియొక్క ఆదర్శాలను వాస్తవ రూపంలోకి మార్చగల పరిస్థితులను ఉత్పాదన చేసి పోషించడానికీ రాజ్యాన్ని అస్తిత్వంలోకి తేవటం జరిగింది. జాతి ఆదర్శాలే ‘చితి' అవుతాయి. ఇది ఒక వ్యక్తియొక్క ఆత్మను పోలినది. చితిని అవగాహన చేసుకోడానికి కొంత ప్రయత్నం కావలసి వుంటుంది. ఒక జాతియొక్క చితిని అభివ్యక్తం చేసి పోషించడానికి దోహదంచేసే శాసనాలను ఆ జాతియొక్క ధర్మంగా అభివర్ణిస్తారు. కనుక ఈ 'ధర్మమే' సర్వోన్నతమైనది. జాతి ఆత్మకి నిక్షేపస్థానం (నిలయం) ధర్మం. ధర్మం నాశనమైతే జాతి అంతరిస్తుంది. ధర్మాన్ని వదిలివేసినవాడు ఎవడైనా జాతికి ద్రోహం చేసినవాడే.
0 Comments