ధర్మం ప్రపంచాన్ని నిలిపివుంచుతుంది

2. ధర్మం ప్రపంచాన్ని నిలిపివుంచుతుంది: | మతమంటే ఒక మార్గం, లేదా ఒక సంప్రదాయం. మత మంటే ధర్మం కాదు. ధర్మం చాలా విస్తృతమైన భావన. అది జీవితంలోని అన్ని అంశాలకు సంబంధించినది. అది సమాజాన్ని నిలబెడుతుంది. మొత్తం ప్రపంచాన్నే నిలబెడుతుంది. ఏదైతే నిలబెడుతుందో అదే “ధర్మం”. | ధర్మం యొక్క మౌలిక సూత్రాలు శాశ్వతమైనవి, విశ్వజనీనమైనవీను. అయినప్పటికీ వాటి ఆచరణ దేశ, కాల, పరిస్థితుల ననుసరించి భిన్నంగా వుండవచ్చు. | ధర్మమంటే సాధారణమైన నియమావళి పై సంపూర్ణ భాష్యము, వాటి తాత్విక ఆధారము. ఈ నియమావళి ఏకపక్షంగా వుండజాలదు. ఏ సమాజాన్ని అవి సేవిస్తున్నాయో దానిని నిలిపి వుంచేవిగాను, దాని అస్తిత్వానికి, పురోగతికి దోహదకారులుగాను వుండాలి.

Post a Comment

0 Comments