జాతికి వ్యక్తిత్వముంది

17. జాతికి వ్యక్తిత్వముంది : భారత్ అనే పేరు ఒక జాతిని సూచిస్తుంది. కాని ఉత్తర ప్రదేశ్, బెంగాల్ వంటి ప్రాంతాల పేర్లు జాతిని సూచించేవి కావు. కనుక ఒక జాతికి ఒక భూభాగం వుండటం తప్పనిసరి అయినప్పటికీ, అది మొదటి ఆవశ్యకత అయినప్పటికీ, భూభాగమే జాతి అవదని మన మనసుల్లో ఒక స్పష్టత వుండాలి. పైకి కనిపించనప్పటికీ అత్యంత తీవ్రమైన అనుభూతినిచ్చే ఒకానొక భావశక్తి మీద జాతి అస్తిత్వం ఆధారపడి వుంటుంది. ఒక వ్యక్తికి వ్యక్తిత్వం వున్నట్లే ఒక జాతికి కూడా వ్యక్తిత్వం వుంటుంది. ఈ జాతీయ వ్యక్తిత్వమే జాతిని సజీవంగా నిలిపి వుంచుతుంది. అది బలహీన పడినపుడు జాతి బలహీనంగా తయారవుతుంది. అది విస్మరించబడినపుడు లేదా నాశనం చేయబడినపుడు మొత్తం జాతి వినాశం దిశగా పోతుంది. ఈ కారణంగానే గతకాలపు అనేక జాతులు ఇప్పుడు వట్టి జ్ఞాపకాలుగా మిగాలాయి. వాటి భూభాగాలు అలాగే వున్నాయి, వాటి ప్రజలు ఇంకా సజీవులే. అయినా ప్రాచీన పర్షియా, గ్రీసు, ఈజిప్టు, అన్నీ కళా విహీనమైనాయి. మరో విధంగా చెప్పాలంటే అవి తమ మౌలికమైన జాతీయ వ్యక్తిత్వాన్ని కోల్పోయాయి.

Post a Comment

0 Comments