దేశం శాశ్వతమైనది

16. దేశం శాశ్వతమైనది :దేశం ఒక శాశ్వత సత్యం. దేశం అవసరాలను నెరవేర్చడానికి రాజ్యం (state) సృష్టించబడింది. రాజ్యం ఆవిర్భావానికి రెండు కారణాలు చెప్పారు. దేశప్రజలలో ఏదైనా
వికృతి ఏర్పడటం మొదటిది. అలాంటి పరిస్థితిలో తలయెతే సమస్యలను అదుపు చేయడానికి రాజ్యం నెలకొల్పబడింది. ఉదాహరణకు ఏ తగాదా లేనప్పుడు పోలీసులు కనిపించరు. కాని ఏదైనా గొడవ జరిగితే పోలీసులను వెంటనే పిలుస్తారు. రెండో అవసరమేమంటే సమాజంలో ఏదైనా సంక్లిష్టత కనిపించినపుడు సంఘజీవితంలో సువ్యవస్థను నెలకొల్పడానికి రాజ్యం అవసరమవుతుంది. సమాజంలో శక్తి, సంపన్నత, వనరులు కలిగిన వర్గం బలహీనులను, నిస్సహాయులను, పేదలను దోపిడీ చేయకుండా చూడటానికి, ప్రతి ఒక్కరు న్యాయపరిమితుల్లో వుండేలా చూడటానికి రాజ్యం సృష్టించబడింది. ఈ రెండు కారణాలవల్ల మాత్రమే రాజ్యం ఏర్పడుతుంది. ఈ రెండు పనులు నెరవేరటానికి మరో మూడోపని ఒక ముఖ్యమైన అంశంగా వుంది. అది ఇతర రాజ్యాలతో సంబంధాలు నెలకొల్పుకోవటం. కనుక బాహ్యదురాక్రమణల నుంచి భద్రత కల్పించటం కూడా రాజ్యం చేయవలసిన పనే.

Post a Comment

0 Comments