జాతి అంటే ఏమిటి?

3, మన జాతీయత
15 జాతి అంటే ఏమిటి?
కొందరి వ్యక్తుల సమూహం ఒక లక్ష్యాన్ని, ఒక ఆదర్శాన్ని ఒక జీవనకార్యాన్ని పెట్టుకొని జీవిస్తూ ఒకానొక భూభాగాన్ని తన మాతృభూమిగా పరిగణిస్తున్నపుడు అదొక జాతి అవుతుంది. ఆదర్శం, మాతృభూమి - ఈ రెండింటిలో ఏ ఒక్కటీ లేకపోయినా జాతి లేనట్లే. - 'జాతి'కి నాలుగు అంశాలు కావాలి. మొదటగా భూమి లేక ప్రజ-దీనినే మనం దేశం అంటాము. రెండవది కలసి కట్టుగా జీవించాలనే ఒక సామూహిక సంకల్పం. మూడవది రాజ్యాంగమని మనం పిలిచే ఒక వ్యవస్థ - దీనిని 'ధర్మం' అంటే మరింత సముచితంగా వుంటుంది. నాలుగవది. ఒక జీవనాదర్శం. ఈ నాలుగింటి సమన్విత రూపాన్నే జాతి అంటారు. శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ కలసి ఒక వ్యక్తి రూపోందినట్లే దేశం, సంకల్పం, ధర్మం, ఆదర్శం అనేవి కలసి ఒక జాతి అవుతున్నాయి.

Post a Comment

0 Comments