14. మన లక్ష్యం: విశేషమైన ప్రయత్నాల ఫలితంగా భారతదేశం బ్రిటిషువారి నుంచి స్వరాజ్యాన్ని సాధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్వాతంత్ర్యాన్ని మనం వదులుకోగోరం. మన రాజకీయ స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే శక్తి సామర్థ్యాలను మన కందజేయటమే మన ప్రణాళిక యొక్క మొదటి ఆశయం. రెండవదేమంటే ఒక ప్రజాస్వామిక ప్రభుత్వ రూపాన్ని మనం ఎంచుకున్నాం. ఏదైనా ఆర్థికాభివృద్ధి కార్యక్రమం మన ప్రజాస్వామిక వ్యవస్థకు అడ్డంకిగా తయారైతే అది మనకు అంగీకార యోగ్యంకాదు. మూడవదేమంటే మన జాతీయ జీవనానికి ప్రోతస్సు, ఫలము, కొలబద్దకూడా అయినట్టి కొన్ని సాంస్కృతిక విలువలు ఏవైతే మనకున్నాయో ఇవి యావత్ ప్రపంచానికి కూడా అత్యంత విలువైనవి. ఈ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయటం మన పరమోన్నత జాతీయలక్ష్యం. ఈ సంస్కృతిని పణంగా పెట్టి ఆర్జించే భౌతిక సంపద అసలు సంపదయేకాదు.
0 Comments