12. సాంస్కృతిక స్వేచ్ఛ : ఆర్ధిక స్వాతంత్ర్యంతోబాటు సామాజిక, సాంస్కృతిక స్వాతంత్ర్యం కూడా అవసరం. ఒక జాతి తన ఆత్మయొక్క అభివ్యక్తీకరణ కొరకు సృష్టించుకున్న సామాజిక వ్యవస్థలు కాలక్రమంలో జాతీయ పురోగతికి ఒక అవరోధమైతే జారి శ్రేయస్సు దృష్ట్యా వాటిని విడనాడటం అవసరమవుతుంది. జాతి ప్రస్థానంలోని ఒకానొకదశలో ఉపయోగకరంగా వున్న కొన్ని సాధనాలు తరువాతి దశలోకూడా ఉపయోగకరంగా కొనసాగాలనిలేదు. సాధనాలు ఆయాదశలకు తగినట్లు వుండాలి. పాత సాధనాలకే అంటి పెట్టుకొని వుండాలనే ప్రలోభం స్వాతంత్ర్యాని కోల్పోవడానికి దారితీయవచ్చు. కారణమేమంటే స్వాతంత్ర్యమనేది ఒకానొక కాలఖండంలో ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే అంశాల సమన్వయం.
0 Comments