ధర్మమంటే మతం కాదు

ధర్మం, మతం 1.ధర్మమంటే మతం కాదు: | ధర్మానికి సంబంధించి ఈనాడు మనం చూస్తున్న వక్రీకరణలన్నీ ప్రధానంగా విదేశీ విద్యవల్ల వచ్చినవే. రెలిజియన్' అనే ఇంగ్లీషు పదం కారణంగా ధర్మం యొక్క విశుద్దమైన అర్ధం చాలావరకు వికృతి చెందింది. బ్రిటిషువారు భారతదేశానికి వచ్చినపుడే మొదటిసారిగా ఈమాట విన్నారు. దీనికి సమానంగా సమగ్రమైన అర్థాన్నియిచ్చే పదం వారి భాషలో లేదు. అందువల్ల దీనిని 'రెలిజియన్ అని అనువదించారు. ఇలాంటి అనువాదాలతో భారతీయ పదాల అర్థం వక్రీకరణ చెందింది. ధర్మం అనేది చాలా విస్తృతమైన పదం. ఇందులో చాలా మతాలు వుంటాయి. మతమంటే ఒక ఆరాధనా విధానం. ఈదేశంలో ఇలాంటి విధానాలు చాలావున్నాయి. ఇన్నివిధానాలు, సంప్రదాయాలు వున్నా ధర్మం మాత్రం ఒకటే. ఆరాధనా విధానం ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరికీ శ్రేయస్సును కలిగించేది యేదో అదే ధర్మం. అదే అతనికి ముక్తిమార్గాన్ని తెరవగలదు.

Post a Comment

0 Comments