విదేశీ వ్యాపారుల లక్షణాలు
వ్యాపారులలో ఇంగ్లీషు, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ వారు కూడా ఉంటారు. వీరు వ్యాపారం కోసం ఇక్కడకి వస్తారు. వారు విలక్షణమైన టోపీలను ధరిస్తారు. కానీ విదేశీ వ్యాపారులు ఇతర వ్యాపారుల వంటి వారు కారు. వారి పాలకులే వారి అధినేతలు. వారి ఆదేశాలు, నిర్ణయాల మేరకే వారు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తారు. వారి పాలకులు తమ పరిధిని విస్తృతం చేసుకోవాలని అనుకోకుండా ఉండటం ఎలా సాధ్యం? ఈ వేర్వేరు టోపీలు, పాగాలు ధరించిన వ్యాపారులు మన రాజ్యంలో లోపలి భాగాల్లోకి వెళ్ళి, తన ప్రభావాన్ని విస్తరించుకునేందుకు, తమ మత ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. చాలాచోట్ల వారు తమ లక్ష్యాలను సాధించగలిగారు కూడా. వారి స్వభావం మోస పూరితం, కుట్రపూరితం. వారు ఏదైనా ప్రాంతాన్ని చేజిక్కించుకుంటే వారు ప్రాణాలు పోయినా దానిని వదులుకోరు.
రాజ శాసనం ఎనిమిది
0 Comments