మాటలో జాగరూకత


మాటలో జాగరూకత
రాజు మౌలికంగా వ్యవహరించాలి. ఏదో ఒక సందర్భం లేదా పని లేకుండా రాజు ఎవరితోనూ మాట్లాడకూడదు. అలా చేస్తే ఆయన సేవలో ఉన్నవారికి అవాంఛిత సాన్నిహిత్యం ఏర్పడి, నియమాలను భంగం చేసారు. రాజు తన కింద పనిచేసేవారిని హేతుబద్ధంగా ఏం చేయాలో ఏం చేయకూడదో బోధించి ప్రోత్సహించాలి. తలెత్తిన పరిస్థితుల్లోని వివిధాంశాల గురించి నిర్మొహమాటంగా చర్చించాలి. వాటిపై తీసుకునే చర్యల వల్ల తలెత్తే పరిస్థితుల రాజకీయ ప్రభావాన్ని గురించి కూడా చర్చించాలి. రాజు అందరి మాటలను విన్నా ఆ సలహాల్లో ఏవి సర్వోత్తమమైనవి, ఏమి అమలుకు యోగ్యమైనవి వంటి అంశాలపై తానే నిర్ణయం తీసుకోవాలి. ఆయన సహచరులు ఎలాంటి పక్షపాతం లేకుండా అభిప్రాయాలను వ్యక్తపరచాలి. రాజు ఆదేశించిన పనుల మంచి చెడులను విచారించాలి. ఆయన కింద పనిచేసేవారే ఈ ఆదేశాలను అమలు చేయాలి. రాజు కనుసైగలు, చేయి ఎత్తడం వంటి సంజ్ఞల ద్వారా రాజుగారి మనోగతాన్ని వారు అర్థం చేసుకోవాలి. అయితే ఎల్లప్పుడూ కను సైగలు, సంజ్ఞలపై మాత్రమే ఆధారపడి కూడదు. రాజు వద్ద పనిచేసే వారు తమ హోదా లేదా బాధ్యత ప్రాధాన్యాన్ని గుర్తించాలి. చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకూ ఎవరూ రాజు చేస్తున్న తప్పుల గురించి తోటివారితో చర్చించకూడదు. తన తప్పిదాలను, లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు నిత్య ప్రయత్నం జరగాలి, తాము చేసిన తప్పులు రాజు దృష్టికి వెళ్లాయన్న సంగతి ఉద్యోగు తెలియకూడదు. దీని వల్ల వారు నిత్య జాగరూకులై, ఎప్పటికప్పుడు తమ తప్పిదాలను సరిదిద్దుకుని, తమను తాము మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తారు.
రాజ శాసనం ఏడు 

Post a Comment

0 Comments