రాజు సహనశీలియై ఉండాలి. ఎందుకంటే ఆయన చాలామంది ప్రజలకు దేవుని వంటి వాడు. రాజ్యంలోని ఉద్యోగులందరూ మామూలుగా ఒకే రకంగా, ఒకే స్వభావం లేదా ఒకే వ్యక్తిత్వంతో ఉండరు. చిన్న వాడి నుంచి పెద్ద స్థాయి అధికారి వరకూ ఉద్యోగులు ఏదో ఒకసమయంలో తమ సంయమనాన్ని కోల్పోయి ఆమోద యోగ్యం కాని భాషను ఉపయోగించి తమ నిరాశను వ్యక్తం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో పాలకుడు సంతులనాన్ని కోల్పోకుండా చిరునవ్వుతో ఉండాలి. తన ప్రజలు ఎందుకు తప్పు చేస్తున్నారో తెలుసుకుని, తగిన చర్యలు తీసుకోవాలి. దీని వల్ల తెలివైన వారు తమ వైఖరిలోని తప్పులను గుర్తించి, బాధపడతారు. తమ నాయకుడి (రాజు) పట్ల కృతజ్ఞతతో ఉంటారు. వారు మళ్లీ అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. ఇలాంటి సహనశీలత లేకపోతే ఉద్యోగుల లోని పొరబాట్లను సరిదిద్దడం అసాధ్యం.
రాజ శాసనం ఆరు
0 Comments