మంత్రి హోదాలో పనిచేసే ప్రతి వ్యక్తి తన ఆత్మ గౌరవం విషయంలో చాలా శ్రద్దతో ఉండాలి. అప్పుడే వారు రాజ్య నిర్వహణ బాధ్యతను నిర్వర్తించ గలుగుతారు. ఆశా వాదంతో, మేధస్సుతో, సకారాత్మక దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటే చక్కని ఫలితాలు లభిస్తాయి. పై గుణ గణాలున్న వారిని వారు తమ సహాయకులుగా నియ మించుకోగలగాలి. వారు తమ నేత పట్ల పూర్తి నమ్మకంతో ఉండాలి. తమకు ఇచ్చిన బాధ్యతలను సర్వ సామర్థ్యాలు, సర్వశక్తులతో నిర్వర్తించేందుకు సదా సంసిద్ధంగా ఉండాలి. రాజు మంత్రుల సలహా మేరకు సహాయకుడిని నియ మించుకుని, ఆ వ్యక్తి గుణ దోషాల మేరకు ఆయనతో పనిచేయించు కోవాలే తప్ప సిఫార్సులతో నియమకాలు చేయకూడదు.
రాజ శాసనం ఇరవై ఒకటి
0 Comments