పర్యావరణంపై శివాజీ దృక్పథం

పర్యావరణంపై శివాజీ దృక్పథం
నౌకాదళానికి పడవలను తయారు చేయడానికి అత్యుత్తమమైన, దృఢమైన టేకు చెట్టు కలప అవసరం. ఇందుకు అవసరమైన చెట్లను | స్వరాజ్యంలోని ప్రాంతాల నుంచి వాటి యజమానుల అనుమతితో కొట్టి | తీసుకురావాలి. ఇంకా ఎక్కువ టేకు అవసరమైతే ఇతర రాజ్యాలు లేదా దేశాల నుంచి కొనుగోలు చేయాలి. - స్వరాజ్యంలోని అడవుల్లో పుష్కలంగా మామిడి, పనస చెట్లున్నాయి. వాటి కలపతో పడవలు చేయవచ్చు. కానీ ఈ చెట్లను ముట్టుకోకూడదు. ఎందుకంటే ఇంత పెద్ద చెట్లు రెండుమూడేళ్లలో ఎదగవు. వీటిని నాటిన వారు వీటిని తమ పిల్లలను చూసుకున్నట్టే చూసుకున్నారు. కాబట్టి ఆ చెట్లను నరికితే వాటి యజమానులకు తీరని దుఃఖం కలుగుతుంది. ఇతరులకు బాధ లేదా దుఃఖం కలిగించి చేసిన పని వల్ల ఆ పనిని చేసిన వ్యక్తి అంతమైపోతాడు. అలా నష్టపోయిన లేదా పీడితుడైన వారి శాపాలను ఆ ప్రాంత పాలకుడు భరించవలసి ఉంటుంది. అలాంటి చెట్లను కొట్టడం ప్రమాదకరం. కాబట్టి మామిడి, పనస చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరక కూడదు. ఐతే పాతదై, దెబ్బతిన్న మామిడి, పనస చెట్లను వాటి యజమానుల అనుమతి పొందిన తరువాత కొట్టివేయవచ్చు. ఆ చెట్టును కోల్పోయి నందుకు యజమానికి నష్టపరిహారం చెల్లించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేకుండా లేదా బలవంతంగా చెట్లను కొట్టరాదు.
రాజ శాసనం పద్దెనిమిది 

Post a Comment

0 Comments