సహచరులతో వ్యవహార శైలి

సహచరులతో వ్యవహార శైలి
రాజు హాస్యం ఆడటం, వేళాకోళం చేయడం, వింతగా ప్రవ ర్తించడం చేయరాదు. ఆయన మిత్రులు, సహచరులు కూడా ఒక విధంగా చూస్తే ఆయన సేవకులే. వారితో హాస్యంగా వ్యవహరించడం వల్ల పరిమితులు లేకుండా పోతాయి. సహచరులు కూడా హద్దులు దాటి రాజు యొక్క గౌరవప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి రాజుతో ఎవరూ చవకబారుగా వ్యవహరించ కూడదు. ఎందుకంటే మాటల సమయంలో సంబంధాల మాన మర్యాదలు, ప్రవర్తనా శైలికి భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఇది కొన్ని సందర్భాల్లో రక్తపాతానికి, ఆగ్రహావేశాల్లో హత్యలకు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి రాజు వినోదాలు చేయడం, హాస్యమాడటం వంటి వాటికి దూరంగా ఉండాలి. తన హాస్య ప్రియత్వం వల్ల తాను గొప్ప మాటకారి అనో, ప్రసంగ కర్త అనో రాజు భావించరాదు. ఈ విషయంలో స్వోత్కర్షకి, సొంత గొప్పలకి, వృథా సంతృప్తికి రాజు తావివ్వకూడదు.
రాజ శాసనం పదిహేడు

Post a Comment

0 Comments