రాచమహలు రక్షకులు

రాచమహలు రక్షకులు
రాజభవనాన్ని, రాజ కుటుంబ నివాస గృహాలను పగలు రాత్రి కాపలా కాసి కాపాడే రక్షకుల స్థానాలు, ఉపస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ప్రతి రోజూ పరీక్షించాలి. ఒక వేళ సైనికులు ఒక సారి తన నిర్ధారిత స్థానంలో లేకపోయినా, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నా అతనికి తన బాధ్యతల గురించి తెలియచేయాలి. అదే తప్పు రెండో సారి చేస్తే తీవ్రమైన హెచ్చరిక చేయాలి. మూడవ సారి మళ్లీ అదే తప్పు : చేస్తే ఆ బాధ్యత నుంచి లేదా పదవి నుంచి తప్పించాలి. అతను శిక్ష పడేంత తప్పు చేసినట్టయితే తప్పనిసరిగా శిక్ష అమలు చేయాలి. ఈ విషయంలో ఎలాంటి మెతక వైఖరిని అవలంబించకూడదు. రాజ భవనం, రాజకుటుంబ రక్షణ బాధ్యత ఉన్న దళాల్లోనే క్రమశిక్షణా రాహిత్యం ఉంటే మిగతా విభాగాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది. రాజ భవంతి రక్షణలో ఉన్న సిబ్బంది వేతనాలను ఎలాంటి ఆలస్యమూ, పొరబాటూ లేకుండా చెల్లించాలి. ఈ శ్రేణికి చెందిన రక్షకుల వేతనాల చెల్లింపు ఒకసమర్థుడైన, ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగని | సబ్నిస్ (అధికారి) ఆధ్వర్యంలో జరగాలి.
రాజ శాసనం పదహారు 

Post a Comment

0 Comments