సలహాకు పరిమితులు

సలహాకు పరిమితులు
రాజ్యం ప్రాధాన్యాన్నిచ్చి ఏయే పనులను చేయాలి, వేటిని చేయ కూడదు అన్న విషయాన్ని సొంత మేధస్సు, తర్కం ఆధారంగా నిర్ణయం చాలి. ఆయా పనుల్లో నిపుణుల సలహాను ఎల్లప్పుడూ తీసుకోవాలి. చేపట్టిన పని సఫలం కావాలంటే మంచి సలహాలన్నిటినీ స్వీకరిం చాలి. రాజు తన ప్రణాళిక ప్రకారమే పని జరగాలని భావిస్తే, ప్రతిభ, సామర్థ్యం, తెలివితేటలు, స్వయంప్రేరణ ఉన్న సహచరులు ఆ కార్యప్రణాళికలో తప్పులను ఎత్తి చూపించరు. కానీ వారు నిర్లక్ష్యానికి గురయ్యామని భావించవచ్చు. దాని వల్ల పని దెబ్బతింటుంది. రాజు పనిలో లాభనష్టాలను స్వయంగా బేరీజు వేయాలి. ఒక పనిలో నిష్ణాతులైన వారి నుంచి సలహాలను సమీక్షలను కోరాలి. మంచి సలహాలను తులనాత్మకంగా బేరీజు వేయాలి, వాటిని గుర్తించాలి. రాజు ఎలాంటి చర్చ, ఆలోచన లేకుండా తన అభిప్రాయాలనే అందరి . పైనా రుద్దడానికి అలవాటుపడితే తెలివైన సేవకులు, సహచరులు తమ అభిప్రాయాలను, ఒక నిర్ణయంలోని మంచిచెడులను గురించి చెప్పడానికి సంకోచిస్తారు. ఫలితంగా నిపుణులైన సేవలకుల సామర్థ్యం, వారి పని నైపుణ్యం తగ్గిపోతుంది. పని దెబ్బతింటుంది.
రాజ శాసనం పదిహేను

Post a Comment

0 Comments