రోజులు గడుస్తున్న కొద్దీ స్వావలంబన ఎంత త్వరగా సాధించాలో మరింత స్పష్టమవుతోంది. జాతీయ స్వాతంత్య్ర గౌరవాలను నిలబెట్టుకొనేందుకు అడ్డుదారులు లేవనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరు కునేందుకుగాను ప్రతి జాతి ఆత్మ నిర్భరత, ఆత్మ సమర్పణల కఠోర మార్గాన పయనించి తీరాలి. మనమీద దురాక్రమణ జరపటం వల్ల మనకు సంభవించిన నష్టాలన్నిటికీ పూర్తి పరిహారాన్నీ, దేశ విభజన నాటి నుండి జరిగిన వివిధ ఒప్పందాల కింద ఏర్పడిన బకాయిలన్నిటినీ పూర్తిగా చెల్లించమని మన నాయకులు పాకిస్తాన్‌ను అడిగి ఉండవలసింది. అట్టి దృఢ విధానం తొలిదశలో కొన్ని కష్టాలను కల్గించినప్పటికీ, ఆర్థికంగా స్వయంపోషకం కావటానికి జాతికి అవకాశం ఏర్పడేది.
0 Comments