దేశంలో విలువలు పెంచేది విద్య


ప్రపంచంలో ప్రారంభమైన నూతన సిద్ధాంతాల ప్రభావం మన దేశ నాయకత్వంపై ప్రభావం చూపటం ప్రారంభమైంది. ఉదాహరణకు యూరప్‌, రష్యా దేశాలలో పోరాటాలు మనవాళ్లకు స్ఫూర్తిగా కనపడ్డాయి. దానిలో రష్యా ప్రభావం ఎక్కువగా ఉండేది. దానితో మనలోని కొంతమంది సోవియట్‌కు విధేయత చూపడం ప్రారంభించారు.
దేశంలో విలువలు పెంచేది విద్య మాత్రమే. విద్య ద్వారా మాత్రమే అవి భావితరాలకు అందుతాయి. విద్య కూడా ఇప్పటి మన దేశంలో విలువలకు దూరంగా నడుస్తోంది. పాశాత్య వ్యామోహ ప్రభావంతోనే సాగుతున్నది. ఇప్పుడు మనదేశంలో విద్యార్థులకు చెపుతున్న చరిత్ర అంతా విదేశీయుల పాలనలోనే మన జాతీయత, మానవత్వం వికాసం చెందాయి అనేదే. ఇది మన జాతికి చాలా నష్టం కలిగించింది. కలిగిస్తూనే ఉంది. ఇటువంటి విద్య చదివిన వారంతా ఈ దేశానికి వ్యతిరేకంగా తయారవుతున్నారు.
   -- పరమ పూజనీయ శ్రీ గురూజీ.

Post a Comment

0 Comments