జాతీయ సంకల్ప శక్తిని జాగృతం చేయాలి


మన దేశం ఎంత విశాలమయినది! ఎంత సారవంతమైనది! నిజానికి మన దేశం భూసారానికి పెట్టింది పేరు. ఐనప్పటికీ ప్రముఖమైన ఈ రంగంలో ఆత్మనిర్భరతను సాధించలేకపోతున్నాం. ఈ సవాలు నెదుర్కొనేందుకు జాతీయ సంకల్ప శక్తిని జాగృతం చేసి, నిర్మాణాత్మకమైన మార్గాల్లో అన్వయించు కోవాలి.ఆచరణపూర్వకమైన ఇటువంటి దేశభక్తి భావన గురించి ప్రజలకు శిక్షణ ఇవ్వవలసి ఉంది. దేశ క్షేమం ఆశించినంత మాత్రాన చాలదు, జాతీయ సంక్షేమాన్ని గురించిన ఆకాంక్షలను మన ప్రవర్తనలో ఎంత ఉత్తమంగా వ్యక్తం చేయగలమనేది తెలుసు కోవాలి.
                                                                                                       ---మాధవ సదాశివ గోళ్వల్కర్‌ (గురూజీ)

Post a Comment

0 Comments