భాషా సామరస్యత - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్

భాషా సామరస్యత - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్

   మహారాష్ట్ర లోని మరాట్వాడా విశ్వవిద్యాలయ ఉపకులపతి ( వైస్ ఛాన్సలర్ ) ప్రొ. శ్రీ శివాజీరావ్ భోంస్లే, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ జ్యేష్ఠ ప్రచారకులు శ్రీ యాదవరావు జోషి గారిది అవినాభావ సంబంధం. 
    ఒకసారిశివాజీరావు గారిని వ్యాఖ్యానమాల కొరకు యాదవరావు జీ బెంగళూరుకు ఆహ్వానించారు. ఆయనకు వసతి బెంగళూరులోని సంఘ కార్యాలయం కేశవకృప లో ఏర్పాటుచేయబడింది. నాలుగు రోజులు బెంగళూరులోని రవీంద్రకళాక్షేత్రంలో శివాజీ మహారాజు గురించి శ్రీ శివాజీరావు భోంస్లే గారి ఉపన్యాసాలు ఇంగ్లీషులో జరిగాయి. అయిదవ రోజు కార్యక్రమం కోసం బయల్దేరుతుండగా యాదవరావు జీ ,భోంస్లే గారితో " మీరు ఈ రోజు మరాఠీ లో మాట్లాడాలి " అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి, మరాఠీలోనా ? అనడిగారు. అవునన్నారు యాదవరావు జీ. 
    కిక్కిరిసిన రవీంద్రకళాక్షేత్రలో ఒకటిన్నర గంట సేపు ఆయన మాట్లాడారు. ఏమాత్రం శబ్దం లేకుండా ఉపన్యాసం విన్నారు శ్రోతలు. ఆ తర్వాత ఆయన చుట్టూ చేరి అభినందనలు తెలిపారు. ఒకటిన్నర గంట సేపు మరాఠి భాషలో వినే అవకాశం లభించిందని శ్రోతలంతా అంటుంటే, చివరలో యాదవరావు జీ సంఘ జ్యేష్ఠ అధికారుల బౌద్ధిక్ విన్నట్లు అనిపించింది అన్నారు. 

     నేడు భాష పేరిట కొట్లాడుకుంటున్న సందర్భంలో సంఘం చేసిన ఈ ప్రయత్నం మెచ్చుకోదగిందికదా ? 

              జమఖండి కి చెందిన శ్రీ దిలీప్ పెండ్సే  గారి జ్ఞాపకం

Post a Comment

0 Comments