8 చైతన్యశీలమైన మతం: వైదికమతం ఎప్పుడూ మార్పుచెందుతూనే వచ్చింది. ఈ మతం చైతన్యశీలమైనది, సజీవమైనదీను. ఇది నిలువనీరు వుండే మురికిగుంటవంటిది కాదు. నూతన ఆలోచనలు ఎప్పుడూ ఈ మతంలోకి ప్రవేశిస్తూవచ్చాయి, పాత ఆలోచనలు మార్పుతో అభివృద్ధి చెందాయి. అయితే ప్రతి కొత్తమార్పు పాతదానితో తన అనుసంధానం నిలుపుకుంటూ వచ్చింది. ప్రతినూతన ఉద్యమకారుడు తన పూర్వీకులపట్ల గౌరవభావన నిలుపుకున్నాడు. ప్రతి నూతన సంస్కర్త మన ప్రాచీన సంప్రదాయానికి, మన పూర్వీకులకు, వారి విజయాలకు గౌరవమిస్తూనే కాలానుగుణ్యమైన నూతన ఆలోచనలను ప్రతిపాదించాడు. ఈ నూతన ఆలోచనలు మౌలిక ఆలోచనతో తెగతెంపులు చేసుకోలేదు గనుక జాతిజీవనానికి ఏవిధంగానూ చేటు చేయలేదు. కాకపోగా దాని వికాసానికే దోహదం చేశాయి.
0 Comments