పాలనా యంత్రాంగంలో పశ్చాత్తాపం

పాలనా యంత్రాంగంలో పశ్చాత్తాపం

తప్పిదం చేశాడని భావిస్తున్న వ్యక్తి సరైన, న్యాయ సంగతమైన దర్యాప్తులో నిర్దోషి అని తేలితే ఆ వ్యక్తిని ఎన్నో విధాల బుజ్జగించాలి. గత బాధ్యతను వదిలే విషయంలో అతనిలో ఎలాంటి సందిగ్ధం లేకుండా చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని తన పాత బాధ్యతలో మళ్లీ నియమించరాదు. ఆయనకు నాలుగు నుంచి ఆరు నెలల జీతాన్నిఇచ్చి, రాజ సేవలో నియుక్తుడిని చేయాలి. ఆ తరువాత అతడి యోగ్యతను బట్టి వేరే చోటకి బదిలీ చేయాలి. తన వివాదాస్పద వ్యాఖ్యల (అవి మంచివైనా, చెడువైనా) వల్ల ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తి తరువాత న్యాయ ప్రక్రియలో నిర్దోషి అని తేలితే ఆయనను కూడా గతంలోని పదవిలో పునర్నియామకం చేయకూడదు. తప్పు చేసినట్టు రుజువైన వ్యక్తులకు వారి నేరం తీవ్రతను బట్టి శిక్ష విధించాలి.
రాజ శాసనం పంతొమ్మిది

Post a Comment

0 Comments