రామాయణం ముఖ్యమైన బిందువులు - Bruyat

🙏🌹🏹🏹🚩🚩🕉️🕉️

*శ్రీరామనవమి శుభాకాంక్షలు*

     *శ్రీ రామాయణము కొన్ని ప్రశ్నలు - జవాబులు*

1. రామాయణము జరిగిన యుగము పేరు ఏమిటి.?
*జ.త్రేతాయుగం*

2. దశరథుడి బాణానికి మృతి చెందిన ముని కుమారుడెవరు..?
*జ.శ్రవణ కుమారుడు*

3. దశరథుడు నిర్వహించిన యాగం పేరేమిటి..?
*జ.పుత్రకామేష్ఠి యాగం*

4. ఈ యాగం నిర్వహించిన ఋత్వికుని పేరేమిటి.?
*జ.ఋష్యశృంగుడు*

5. దశరథుడి కుమారుల పేర్లేమిటి..?
*జ.రాముడు,లక్ష్మణుడు, భరతుడు,శ్రతఘ్నులు*

6. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వద్ద నేర్చుకున్న విద్యలు..? 
*జ.బల అతిబల*

7. విశ్వామిత్ర యాగమును విధ్వంసం చేసిన రాక్షసులు ఎవరు..?
*జ.సుభాహులు, తాటక*

8. సీతాపహరణాన్ని ఆపడం కోసం రావణుడితో యుద్ధం చేసిన పక్షి పేరు ఏమిటి.?
*జ.జటాయువు*

9. శ్రీ రాముడు మరియు సుగ్రీవుడు కలుసుకున్న పర్వతం పేరు ఏమిటి.?
*జ.ఋష్యమూక*

10. వాలి కుమారుడి పేరేమిటి.?
*జ.అంగదుడు*

11. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు భార్యల పేర్లు ఏమిటి..?
*జ.సీత,ఊర్మిళ, మాండవి,శ్రుతకీర్తి*

12. హనుమంతుడి తల్లి పేరు ఏమిటి.?
*జ.అంజనీదేవి*

13. శ్రీరాముడి కులగురువు ఎవరు.?
*జ.వశిష్ఠుడు*

14. భరతుడి తల్లి పేరు ఏమిటి.?
*జ.కైకేయి*

15. రావణుడి ఇద్దరు సోదరుల పేర్లు ఏమిటి.?
*జ.   కుంభకర్ణుడు,విభీషణుడు*

16. ధర్మ పక్షపాతి అయిన రావణుడి సోదరుడి పేరు ఏమిటి..?
*జ.విభీషణుడు*

17. రామాయణ మహాభారతాలను ఏమని పిలుస్తారు.?
*జ.ఇతిహాసాలు*

18. సీత జన్మించిన ప్రదేశము.
*జ.సీతామడి*

19. రావణాసురుడి భార్య పేరేమిటి.?
*జ.మoడోదరి*

20. శ్రీలంక నుండి అయోధ్యకు సీతమ్మతో తిరిగివచ్చిన వాహనం పేరు ఏమిటి..?
*జ.పుష్పకవిమానం*

21. శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఎన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు..?
*జ.9 వేల సంవత్సరాలు*

22. లక్ష్మణుడు పరిపాలించిన రాజ్యం, నేడు దాన్ని ఏమని పిలుస్తున్నాము..?
*జ.లక్ష్మణ పురి*

23. అయోధ్య నగరాన్ని మొట్టమొదట నిర్మాణం చేయించిన వారు ఎవరు.?
*జ.మను*

24. తెలుగులో రామాయణాన్ని వ్రాసిన రచయితలలో కనీసం ఇద్దరి పేర్లు రాయండి.
*జ.రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం*

25. తెలుగు రాష్ట్రాల్లో శ్రీఆదిశంకరాచార్యులు దర్శనం చేసుకున్న శ్రీరామక్షేత్రం ఎక్కడుంది.?
*జ.భద్రాచలం.*

🕉️🚩🕉️🏹🚩🏹🏹🚩

Post a Comment

0 Comments