52. సంస్కారాలు లేని ప్రజాస్వామ్యం: వ్యక్తికీ, సమాజానికీ మధ్య ఎలాంటి ఘర్షణ లేదు; ఒకవేళ వుంటే అది అసహజమైనది. సమాజ ప్రయోజనానికై వ్యక్తి స్వేచ్ఛను అణచటం అవసరంకాదు. వాస్తవానికి విశృంఖలమైన స్వేచ్ఛ వ్యక్తి వికాసానికి గాక అతని వినాశానికే దారితీస్తుంది. సమాజంతో వ్యక్తి సంపూర్ణంగా తాదాత్మ్యత చెందటమనేదే వ్యక్తి యొక్క సంపూర్ణ వికసితస్థితి అవుతుంది. సమాజ పరిపూర్ణతకు వ్యక్తియే మాధ్యమం, ప్రమాణం కూడాను. వ్యక్తి స్వేచ్ఛ, సమాజ ప్రయోజనం పరస్పర విరుద్ధమైనవికావు. ప్రజల కర్తవ్యాల పరిపూర్తికి ప్రజాస్వామ్యం ఒక సాధనం మాత్రమే. ప్రజల జీవితంలో జాతిపట్లగల మనోభావం, బాధ్యతా స్పృహ, క్రమశిక్షణలమీద సాధనం యొక్క ప్రభావశీలత ఆధారపడి వుంటుంది. పౌరుడిలో ఈ సంస్కారాలు లోపిస్తే ప్రజాస్వామ్యం వ్యక్తియొక్క వర్గంయొక్క పార్టీయొక్క ప్రయోజనానికి సాధనంగా దిగజారుతుంది.
0 Comments